Chairman of the BCCI
-
ఐసీసీ ఛైర్మన్ గా శ్రీనివాసన్ నియామకం
మెల్బోర్న్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఐసీసీ వార్షిక సమావేశంలో గురువారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ వార్షిక సమావేశం అనంతరం 29న శ్రీనివాసన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. పిటిషన్ దాఖలు చేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (క్యాబ్)కు అధికారిక గుర్తింపు లేనందున సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. శ్రీనివాసన్ అభ్యర్థిత్వాన్ని బీసీసీఐ ఇంతకుముందే నిర్ణయించినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఎన్నికకు వారం రోజులు ముందు మరోసారి దాన్ని ఖరారు చేయాల్సి వుంటుంది. -
ఐసీసీ చైర్మన్గా శ్రీనివాసన్?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్గా బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం చెన్నైలో జరిగే బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బోర్డు పాలకమండలి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. అలాగే బోర్డు నుంచి ఐసీసీకి వెళుతున్న భారీ ఆదాయంలో అధిక వాటాను అడిగేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ‘ఐసీసీ చైర్మన్గా శ్రీనివాసన్ పేరును ప్రతిపాదించే అధికారం వర్కింగ్ కమిటీకి ఉండదు. అయితే చర్చించే వీలుంటుంది. ఆ పదవి విషయంలో ఆయనకు బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కానీ పాలక మండలి సమావేశం అంగీకారం కావాల్సి ఉంటుంది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీలో ఇంతకాలం చైర్మన్ పదవి లేదు.