
ఐసీసీ అధ్యక్షుడిగా జహీర్ అబ్బాస్
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఒక సంవత్సరం పాటు జహీర్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. పాలసీ ప్రకారం అధ్యక్ష పదవి పాకిస్తాన్‌కు దక్కాల్సి ఉండగా.... పీసీబీ అబ్బాస్ పేరును ప్రతిపాదించింది. ‘స్టైలిష్ బ్యాట్స్‌మన్‌గా అద్భుతమైన ఆటతీరు, రికార్డులు అతనేంటో చెబుతాయి. కెరీర్ ఆసాంతం చక్కటి క్రీడా స్ఫూర్తిని కొనసాగించిన అబ్బాస్ క్రికెట్‌కు అసలైన రాయబారి’ అంటూ ఈ సందర్భంగా జహీర్‌ను ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌అభినందించారు.