ఐసీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
మెల్‌బోర్న్: క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యం తో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... కొత్తగా మరో రెండు దేశాలు నేపాల్, నెదర్లాండ్స్‌లకు టి20 హోదా కల్పించింది. తొలి చైర్మన్‌గా ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఐసీసీకి అనుబంధంగా రూపొందించిన పలు సబ్ కమిటీలకు ఆమోదముద్ర వేసింది. అత్యంత ప్రధానమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పాకిస్థాన్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల అధ్యక్షులు నజాం సేథి, డేవిడ్ కామెరూన్‌లకు చోటు కల్పించింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి వాలీ ఎడ్వర్డ్స్ (ఆస్ట్రేలియా) సారథ్యం వహిస్తారు. శ్రీనివాసన్, గైల్స్ క్లార్క్ (ఇంగ్లండ్)లు ఇతర సభ్యులుగా ఉంటారు.
టెస్టు మ్యాచ్‌లో గాయంతో మైదానాన్ని వీడిన బౌలర్ తిరిగి మైదానంలోకి వచ్చినా... బయట ఉన్నంత సమయం గానీ, కనీసం 30 ఓవర్లపాటు గానీ ఫీల్డింగ్ చేస్తే మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతిస్తారు.
ఇప్పటిదాకా 80 నిమిషాలుగా ఉన్న టి20 మ్యాచ్ నిర్ణీత సమయాన్ని 85 నిమిషాలకు పెంచారు. అమెరికాలో యూఎస్‌ఏ క్రికెట్ అసోసియేషన్ (యూఎస్‌ఏసీఏ)కు అధికారిక గుర్తింపునిచ్చారు. ఒమన్ క్రికెట్ (ఓసీ)ని 38వ అసోసియేట్ సభ్యదేశంగా గుర్తించారు.
నేపాల్, నెదర్లాండ్స్‌లకు టి20 హోదా
Published Sun, Jun 29 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement