
వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు (రోహిత్, కోహ్లి, రాహుల్, షమీ, బుమ్రా, జడేజా) ఉన్నారు. మ్యాక్స్‌వెల్, జంపా (ఆ్రస్టేలియా), డికాక్ (దక్షిణాఫ్రికా), డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), మదుషంక (శ్రీలంక) ఇతర సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment