టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టు తరపున ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పించడం లేదు. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులలో ఆడేందుకు షమీ సిద్దంగా ఉన్నాడని, త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడని వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు మరో అనూహ్య కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. షమీకి ఎన్సీఏ వైద్య బృందం తాజాగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. షమీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని, ఐదో రోజుల పాటు జరిగే టెస్టు క్రికెట్‌కు అతడు సిద్దంగా లేడని వైద్యం బృందం తేల్చినట్లు సమాచారం.
కానీ చిన్నస్వామి స్టేడియం వేదికగా బరోడా-బెంగాల్ జట్ల మధ్య జరగనున్న ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో షమీ ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. షమీకి మరోసారి ఏన్సీఎ వైద్య బృందం ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వినికిడి.
అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే షమీ ఇప్పటిలో ఆస్ట్రేలియాకు వెళ్లేలా కన్పించడం లేదు. కాగా షమీ ఫిట్‌నెస్‌పై రెండో టెస్టు అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. షమీ మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడని, అతడిపై ఒత్తిడి తీసుకురావాలనుకోవడం లేదని రోహిత్ చెప్పుకొచ్చాడు.
షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో కూడా ఈ బెంగాల్ స్టార్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నప్పటికి అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.
ఇక ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టులో ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు మూడో టెస్టుకు సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భారత్ భావిస్తోంది.
చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment