వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్.. సెమీస్ రేసు నుంచి దాదపు నిష్క్రమించినట్లే. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమి పాలై పాక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
కాగా టోర్నీలో పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 31న కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బాబర్‌కు ప్రస్తుత తరంలో తన ఫేవరేట్ క్రికెటర్లు ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా బాబర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్లు చెప్పాడు.
"వరల్డ్ క్రికెట్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ నా ఫేవరేట్ బ్యాటర్లు. వీరు ముగ్గురు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. వారు ప్రపంచంలో ఎక్కడైనా అద్బుతంగా ఆడగలరు. విరాట్, రోహిత్, కేన్‌లలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. వారు మగ్గురికి క్లిష్ట పరిస్థితుల నుండి జట్టును అదుకునే సత్తా ఉంది.
అదే విధంగా కఠినమైన బౌలింగ్‌లో కూడా ఈజీగా పరుగులు సాధిస్తారు. నేను వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మరి కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్! రోహిత్‌కు గాయం!
Comments
Please login to add a commentAdd a comment