
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా యూఎస్‌ఎతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆజం 4067 పరుగులు సాధించాడు. ఇక ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 117 టీ20 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లిని బాబర్ అధిగమించాడు.
ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో బాబర్ ఆజం, విరాట్ కోహ్లి తర్వాత రోహిత్ శర్మ(4026) మూడో స్ధానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌కు అమెరికా ఊహించని షాకిచ్చింది. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్‌పై అమెరికా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment