బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. ప్రత్యర్ధి ముందు కేవలం 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు.
అయితే టీమిండియా ఇప్పటివరకు ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని ఒకే ఒక్కసారి కాపాడుకుంది 2004లో వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని విజయం సాధించింది.
ఆస్ట్రేలియాను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో చారిత్రత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో భారత జట్టు కూడా అదే అద్భుతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత గెలుపుపై ఆశలు పెట్టకోవద్దని జడేజా తెలిపాడు.
"107 పరుగులను భారత్ డిఫెండ్ చేసుకుంటే నిజంగా చాలా గ్రేట్. కానీ వాస్తవం మాట్లాడుకుంటే టీమిండియా గెలవడం చాలా కష్టం. ఐదో రోజు ఉదయం తేమ ఎక్కువగా ఉంటుంది. భారత్ పేస్ బౌలింగ్‌తో ఆటను ప్రారంభిస్తారు. కాబట్టి బంతి పెద్దగా స్వింగ్ అవుతుందని అనుకోవడం లేదు.
ఒకవేళ పిచ్ పేసర్లకు సహకరించి ఒకట్రెండు వికెట్లు పడినా, ఆ పరిస్థితులను అడ్వాంటేజ్ తీసుకునేందుకు భారత్ వద్ద మూడవ సీమర్ లేరు" అని జడేజా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఇద్దరు పేసర్లతోనే ఆడుతోంది. ఆకాశ్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు.
చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment