
Ajay Jadeja Comments on Virat kohli Statement: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్ ఆనంతరం మాట్లడిన విరాట్ కోహ్లి.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసిందని పేర్కొన్నాడు. అయితే కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా నిరాశ వ్యక్తం చేశాడు.
"ఆ రోజు విరాట్ కోహ్లి మాటలు విన్నాను. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ వెనుకబడిందని అతడు తెలిపాడు. దాంతో నేను నిరాశ చెందాను. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు ఉన్నప్పుడు జట్టు వెనుకబడటానికి అవకాశం లేదు. మ్యాచ్ చేజారే పరిస్థితే ఉండదు. విరాట్ మాత్రం ఇలా చెప్పడం మ్యాచ్ పట్ల భారత జట్టు అవలంబించిన విధానం ఎలా ఉందో తెలుపుతోంది’’ అని వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకునే ఫేవరెట్ జట్టు ఇంగ్లండ్ అని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ గెలిచి ఇంగ్లండ్ తన సత్తా ఏంటో చూపిందని గుర్తు చేశాడు. ఇక సెమీస్ చేరే జట్ల గురించి మాట్లాడుతూ... "టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించింది. కానీ గ్రూప్-1 నుంచి సెమీస్‌కు అర్హత సాధించే రెండో జట్టు ఎవరనేది నేను అంచనా వేయలేకపోతున్నాను. సూపర్ 12లోని గ్రూప్ 1లో ఐపీఎల్ తరహా దృశ్యాన్ని నేను చూస్తున్నాను. దాదాపు అన్ని జట్లకు సమాన బలాలు ఉన్నాయి. ఇక జట్ల బలహీనతల గురించి నేను మాట్లలేడలేను. ఎందుకంటే.. ఏ జట్టు అయినా తనదైన రోజున ప్రత్యర్థి జట్టును ఓడించగలదు" అని అజయ్ జడేజా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కోహ్లి ఏమాన్నడంటే...
మ్యాచ్ ఆనంతరం మాట్లడిన విరాట్ కోహ్లీ.. పవర్‌ప్లేలో కీలక వికెట్లు కోల్పోవడం వల్ల జట్టును దెబ్బతీసిందని తెలిపాడు. స్లోగా మొదలుపెట్టి.. తిరిగి పుంజుకోవడం కూడా అంత సులభమేమీ కాదు. 15-20 అదనపు పరుగులు రాబట్టాల్సింది. కానీ పాకిస్తాన్ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు ఆదేవిధంగా భారత్‌పై అద్బుతంగా బౌలింగ్ చేసిన పాక్ బౌలర్‌లను కోహ్లి అభినందించాడు.
చదవండి: Virat Kohli: వాళ్లు బాగా ఆడారు.. అయినా ఇదే చివరి మ్యాచ్ కాదు కదా