కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా సిద్దమైంది. స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలుత టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ముంబై వేదికగా జనవరి 3న జరగనుంది. కాగా టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
దీంతో ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్ తొలి సారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు వన్డేలు, టెస్టులలో అదరగొడుతున్న యవ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్‌కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు గిల్‌కు చోటు దక్కినప్పటకీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.
టీ20ల్లో గిల్ అరంగేట్రం
ముంబై వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20తో గిల్ పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్, రాహుల్ దూరం కావడంతో కిషన్‌కు జోడిగా గిల్‌ను పంపాలని మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా యువ పేసర్ శివమ్ మావి కూడా అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
మరోవైపు తొలి టీ20కు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్‌ను పక్కన పెట్టాలని టీమ్ మేనేజేమెంట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్,వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
శ్రీలంకతో తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు
Comments
Please login to add a commentAdd a comment