శివమ్‌ మావి కళ్లు చెదిరే క్యాచ్‌.. హార్దిక్‌ షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌ | Hardik Pandyas reaction after Shivam Mavi takes incredible running catch | Sakshi
Sakshi News home page

IND vs SL: శివమ్‌ మావి కళ్లు చెదిరే క్యాచ్‌.. హార్దిక్‌ షాకింగ్‌ రియాక్షన్‌ వైరల్‌

Published Sun, Jan 8 2023 5:47 PM | Last Updated on Sun, Jan 8 2023 5:49 PM

 Hardik Pandyas reaction after Shivam Mavi takes incredible running catch - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు శివమ్‌ మావి సంచలన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 10 ఓవర్‌లో చాహల్‌ వేసిన ఫుల్‌ ఆఫ్‌సైడ్‌ బంతిని చరిత్‌ అసలంక భారీ షాట్‌ ఆడాడు.

దీంతో అది బౌండరీ దాటడం ఖాయమని అంతా భావించారు. కానీ స్వీపర్ కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మావి పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్టన్నింగ్‌ క్యాచ్‌కు అందరూ ఫిదా అయిపోయారు.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం మావి మెరుపు క్యాచ్‌ చూసి ఆశ్చర్యపోయాడు. మావి క్యాచ్‌ పట్టిన హార్దిక్‌ సూపర్‌ అంటూ వెరైటీ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇక మావి క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌(112 నాటౌట్‌)కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ సిరీస్‌ టోర్నీ ఆసాంతం అదరగొట్టిన భారత ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ దక్కింది.
చదవండిIND vs SL: డివిలియర్స్‌, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement