![Virat Kohli,climb up in ICC rankings following prolific series against Sri Lanka - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/18/Untitled-2_2.jpg.webp?itok=jEhjIuWB)
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 283 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్‌కు చేరే అవకాశం ఉంది. టాప్ ర్యాంక్‌లో 887 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు.
కాగా కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాబర్‌ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సిరాజ్ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే..
Comments
Please login to add a commentAdd a comment