
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
కాగా ఈ సిరీస్‌లో ఇది విరాట్‌కు రెండో సెంచరీ కావడం గమానార్హం. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.
అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు.
చదవండి: IND vs SL: వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment