Watch: Suryakumar Yadav Heart Touching Gesture For Sanju Samson In Ind Vs SL, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND vs NZ: మా సంజూ ఎక్కడ? ఇదిగో ఇక్కడ .. శభాష్‌ సూర్య! వీడియో వైరల్‌

Published Tue, Jan 17 2023 10:54 AM | Last Updated on Tue, Jan 17 2023 12:24 PM

Suryakumar Yadav Heartfelt Gesture For Sanju Samson - Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తన సొంత రాష్ట్రం కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కేరళలో మ్యాచ్‌ జరిగిందింటే చాలు సంజూ జట్టులో లేకపోయినా అభిమానుల సందడి మాములుగా ఉండదు. తాజాగా మరోసారి సంజూ అభిమానులు అతడిపై ప్రేమను చాటుకున్నారు. భారత్‌-శ్రీలంక మధ్య మూడో వన్డే తిరువనంతపురం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో స్టేడియమంతా సంజూ పేరుతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న భారత స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ను.. మా సంజూ ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నించారు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ తన సమాధానంతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. సంజూ మా గుండెల్లో ఉన్నాడంటూ సూర్య సైగ చేశాడు.

దీంతో ఒక్క సారిగా అభిమానుల కేకలతో స్టేడియం దద్దరిల్లపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు శాంసన్‌ భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు.

అయితే ముంబై వేదికగా తొలి టీ20లో గాయపడిన సంజూ.. సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఈ కేరళ ఆటగాడికి జట్టు దక్కలేదు. అయితే సంజూను ఎందుకు ఎంపిక చేయలేదన్న సృష్టత బీసీసీఐ ఇవ్వలేదు. కాగా సంజూ ఇంకా మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ind Vs SL 3rd ODI: టీమిండియా ప్రపంచ రికార్డుతో పాటు.. ఈ ఘనతలు కూడా! ఆసీస్‌ను దాటేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement