శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనింగ్ బ్యాటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్య ఇప్పటివరకు టీ20ల్లో మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.
తొలి సెంచరీ ఇంగ్లండ్‌పై చేయగా.. న్యూజిలాండ్‌పై రెండో సెంచరీ, తాజాగా శ్రీలంకపై తన మూడో సెంచరీ నమోదు చేశాడు. అదే విధంగా టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా ఈ ముంబైకర్ నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఇక ఓవరాల్‌గా టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా సూర్య నిలిచాడు. తొలి స్థానంలో నాలుగు సెంచరీలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఆతర్వాత స్థానాల్లో వరుసగా మ్యాక్స్‌వెల్, మున్రో, డేవిజీ, చెరో మూడు సెంచరీలతో ఉన్నారు.
చదవండి: IND vs SL: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment