టీ20ల్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను సూర్యకుమార్ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు.
"ప్రపంచ క్రికెట్‌లో కొత్త యూనివర్స్ బాస్ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు.
సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్, క్రిస్ గేల్‌తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్‌ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment