
స్వదేశంలో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తొలి టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేశాడు. శనివారం రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య సెంచరీ సాధిచాడు. ఓవరాల్‌గా 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ను భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలతో ముంచెత్తాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ తన విధ్వంసకర ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు అంత సులభంగా ఎలా బ్యాటింగ్ చేయగల్గుతున్నాడో అర్ధం కావడం లేదు. ఒక వేళ నేను బౌలర్ అయివుంటే అతడు ఆడే షాట్‌లకు ఖచ్చితంగా భయపడేవాడిని.
ఎందుకుంటే ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన షాట్లు అలా వున్నాయి. మైదానం నలుమూలల సూర్య షాట్లు ఆడాడు. అదే విధంగా రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా ఆడాడు. తొలుత పిచ్ బౌలర్లకు సహకరించినప్పటికీ.. పవర్‌ప్లేలో త్రిపాఠి చాలా దూకుడుగా ఆడాడు. అనంతరం సూర్య తన పనిని తను పూర్తి చేసుకుపోయాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
Comments
Please login to add a commentAdd a comment