
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్‌బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నిరాశ పరిచాడు . రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన కోహ్లి.. దనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగాడు. నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనైనా అద్భుతంగా ఆడాలని భావించిన కోహ్లికి ఆదృష్టం కలిసి రాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన జయవిక్రమ బౌలింగ్‌లో.. నాలుగో బంతికి డిఫెన్స్ కోహ్లి పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి నేరుగా కోహ్లి ప్యాడ్‌కు తగిలింది. దీంతో లంక ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. వెంటనే ఆన్-ఫీల్డ్ అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లి తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే తన ఔట్‌పై కోహ్లి కోపంగా రియాక్ట్ అవుతాడని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా అతడు చిన్నగా నవ్వుతూ పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment