
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కింగ్ కోహ్లికి అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్‌లో కూడా కోహ్లికు వీరాభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్- ఆస్ట్రేలియా రెండో టెస్టు సందర్భంగా కోహ్లిపై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని ప్లకార్డు పట్టుకుని మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్లకార్డులో ఏముందంటే.. "డియర్ విరాట్! నువ్వు సెంచరీ చేసినా, చేయకపోయినా, నువ్వే నా హీరోవి" అంటూ పేర్కొన్నాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పాక్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా ఇటువంటి పోస్టర్లు కనిపించాయి. కోహ్లి తన 71వ సెంచరీను పాకిస్తాన్‌లో సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. 2019లో చివర సారిగా బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు. ఇక శ్రీలంకతో జరగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోను కేవలం 23 పరుగులు మాత్రమే చేసి కోహ్లి మరోసారి నిరాశపరిచాడు.
చదవండి: Ind Vs SL 2nd Test: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన!
A fan at the National Stadium Karachi showing some support for Virat Kohli #Cricket pic.twitter.com/vrZv2VCyRk
— Saj Sadiq (@SajSadiqCricket) March 12, 2022
Comments
Please login to add a commentAdd a comment