ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు.
ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్‌ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్‌మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్‌ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.
చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment