Asia Cup 2022 Super 4 Match 3: India Vs Sri Lanka Head To Head Record - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ ఎలా ఉన్నాయంటే..?

Published Tue, Sep 6 2022 1:46 PM | Last Updated on Tue, Sep 6 2022 2:13 PM

Asia Cup 2022 Super 4 Match 3: India Vs Sri Lanka Head To Head Record - Sakshi

ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 6) భారత్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ స్టేజీలో శ్రీలంక ఇప్పటికే ఓ విజయం (ఆఫ్ఘనిస్తాన్‌పై) సాధించి మెరుగైన రన్‌రేట్‌తో (0.589) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా.. పాక్‌ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (-0.126) నిలిచింది. 

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు, పసికూనే కదా అని శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంకేయులు భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించి మాంచి జోష్‌ మీద ఉన్నారు. శ్రీలంక అదే జోష్‌ను ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేస్తే.. టీమిండియా ఇంటి బాట పట్టక తప్పదు.   

ఇరు జట్ల మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ సైతం ఆసియా కప్‌లో శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నాయి.  ఈ టోర్నీలో శ్రీలంకకు భారత్‌తో సమానమైన విన్నింగ్‌ రికార్డు ఉంది. ఆసియా కప్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 10, శ్రీలంక 10 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20ల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో టీమిండియా లంకేయులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 25 టీ20 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 17, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. 

ఇరు జట్ల మధ్య తాజాగా జరిగిన 5 టీ20లను పరిశీలిస్తే.. చివరి 3 మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించినప్పటికీ.. వారి సొంతగడ్డపై జరిగిన 2 టీ20ల్లో లంకేయులే జయకేతనం ఎగురవేశారు. ఓవరాల్‌గా చూస్తే.. లంక జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ, వారిదైన రోజున వారిని ఆపడం మాత్రం చాలా కష్టం. బౌలింగ్‌ పరంగా కాస్త బలహీనంగా కనబడే శ్రీలంక.. బ్యాటింగ్‌లో మాత్రం తగినంత డెప్త్‌ కలిగి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ మరోసారి కీ రోల్‌ ప్లే చేయనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. 

తుది జట్ల అంచనా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్

శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక
చదవండి: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement