
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు తడుబడుతున్నారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాలో పడింది. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను అద్భుతమైన బంతితో మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 6ఓవర్‌లో మహమ్మద్ షమీ వేసిన తొలి బంతిని కరుణరత్నే అంచనా వేసే లోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకుపోయింది. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతి టర్న్ అయ్యి నేరుగా వికెట్లు పైకి వచ్చింది. దీంతో బ్యాటర్ ఒక్క సారిగా షాక్ గురయ్యాడు. ఇక నాలుగు పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకుమందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (15)తో పాటు విరాట్ కోహ్లి (23), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: Ind Vs SL 2nd Test: దటీజ్ అయ్యర్.. బంతి స్టేడియం బయటకు వెళ్లాల్సిందే!
Bowled! In his first ball shami you beauty #indvsl 😘😘 pic.twitter.com/XBGdFpsoAW
— Cricket Gamee (@cricketgamee62) March 12, 2022
Comments
Please login to add a commentAdd a comment