
PC: ICC T20.Com
టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అయ్యర్ అద్భుత ప్రదర్శన గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్‌లో అయ్యర్ హ్యాట్-ట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్‌లో అయ్యర్ 204 పరుగులు చేశాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో అయ్యర్ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు.
ఇక శ్రీలంకతో జరగుతోన్న టెస్టుల్లోను అయ్యర్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోను అయ్యర్ ఆర్ధసెంచరీలు సాధించాడు. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్ ఎంపికైంది. గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేర్ అద్భుతంగా రాణించింది.
చదవండి: IPL 2022: ధోని.. నా ఆలోచనలకు పూర్తి భిన్నంగా చేసేవాడు.. నేనేమీ కోహ్లిని కాదుగా: డు ప్లెసిస్
Comments
Please login to add a commentAdd a comment