
టీమిండియా యువ పేసర్ చేతన్ సకారియాను ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అతడు వేలంలో తన పేరును కనీస ధర రూ. 50 లక్షల రూపాయలుగా రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. కాగా గత ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన సకారియా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021లో 14 మ్యాచ్‌లు ఆడిన సకారియా 14 వికెట్లు పడగొట్టాడు.
దీంతో అతడికి ఏకంగా భారత జట్టు తరుపున అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. గత ఏడాది జూలైలో శ్రీలంకపై టీ20ల్లో భారత తరపున సకారియా అరంగేట్రం చేశాడు. ఇక తాజాగా క్రికెట్. కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని సకారియా బయటపెట్టాడు. ఐపీఎల్-2021లో తన డెబ్యూ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిను సకారియా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో ధోనిను ఔట్ చేయడం తన బెస్ట్ మూమెంట్ అని సకారియా తెలిపాడు.
“ఐపీఎల్ 2021లో ఎంస్ ధోని వికెట్ తీయడం నా బెస్ట్ మూమెంట్. అదే విధంగా నా తొలి మ్యాచ్ కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ధోని భాయ్ వికెట్ తీయడం కంటే ఎక్కువ ఏమీ కాదు. అతడు ఆటలో ఒక లెజెండ్. ఒక లెజెండ్‌కు బౌలింగ్ చేయడం, ఔట్ చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. నేను మ్యాచ్‌లోనూ, నెట్స్‌లోనూ డివిలియర్స్‌కి బౌలింగ్ చేశాను. డెత్ ఓవర్లలో అతడు అన్ని రకాల షాట్లు ఆడతాడు. కాబట్టి అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడి వికెట్‌ను తీయాలని కోరిక ఉండేది. కానీ అతడు ఇప్పుడు క్రికెట్ నుంచి తప్పుకోవడంతో నాకు మరి అవకాశం లేదు. అయితే ఐపీఎల్-2022లో విరాట్ భాయ్ వికెట్ సాధించాలని అనుకుంటున్నాను" అని సకారియా పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ జట్టుకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment