
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తమ ప్లేఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపుకుంది. కాగా తిరిగి జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ చేతన్ సకారియా తన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను ఔట్ చేసి సకారియా ఢిల్లీ జట్టుకు శుభారంభం ఇచ్చాడు.
కాగా బట్లర్‌ను ఔట్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం సకారియా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సకారియా 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున అతడి వికెట్ సాధించడం నాకు చాలా పెద్ద విషయం. బౌలింగ్‌లో నా ప్రణాళికలను బాగా అమలు చేసాను. ఈ మ్యాచ్‌లో నా బౌలింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాను" అని సకారియా పేర్కొన్నాడు.
చదవండి: Rishi Dhawan: 'టీమిండియాలోకి తిరిగి రావడమే నా టార్గెట్'