మ్యాచ్‌ విజయం.. షర్ట్‌ లేకుండా డ్యాన్స్‌ చేసిన ఆటగాళ్లు | IPL 2021: Kartik Tyagi Chetan Sakariya Shirtless Dance RR Dressing Room | Sakshi
Sakshi News home page

Kartik Tyagi Dance: మ్యాచ్‌ విజయం.. షర్ట్‌ లేకుండా డ్యాన్స్‌ చేసిన ఆటగాళ్లు

Published Wed, Sep 22 2021 3:33 PM | Last Updated on Wed, Sep 22 2021 3:46 PM

IPL 2021: Kartik Tyagi Chetan Sakariya Shirtless Dance RR Dressing Room - Sakshi

Courtesy: IPL Twitter

PBKS Winning Moment.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్తాన్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ విజయంలో కార్తిక్‌ త్యాగి పాత్ర మరువలేనిది. ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌కు నాలుగు పరుగులు అవసరమైన దశలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ గెలవడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మ్యాచ్‌ హీరో కార్తిక్‌ త్యాగి, బౌలర్‌ చేతన్‌ సకారియాలు షర్ట్‌ లేకుండా డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ చేశారు. వీరికి యశస్వి జైశ్వాల్‌ తోడవ్వడంతో మరింత కళ వచ్చి చేరింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ విజయం డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంతోషాన్ని నింపింది. హల్లాబోల్‌.. రాయల్స్‌ ఫ్యామిలీ అంటూ ఆర్‌ఆర్‌ ట్వీట్‌ చేసింది.


Courtesy: IPL Twitter

చదవండి: Kartik Tyagi: ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదు.. కానీ కార్తిక్‌

'ఒక మ్యాచ్‌ గెలిచామంటే సంబరాలు చేసుకోవడం సాధారణం. అయితే అద్భుత మ్యాచ్‌లు అప్పుడప్పుడే జరుగుతుంటాయి. కానీ కార్తిక్‌ త్యాగి అసాధారణ ప్రతిభతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఇది అతని సొంతం' అంటూ పంజాబ్‌ కింగ్స్‌ డైరెక్టర్‌ కుమార్‌ సంగక్కర తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement