సాక్షి, గుంటూరు: చంద్రబాబును పవన్ కలవడంలో ఆశ్చర్యమేమీ లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వారు ఇప్పటిదాకా కలిసే పనిచేస్తున్నారు.. రాబోయే రోజుల్లో కూడా కలిసే పోటీ చేస్తారన్నారు. బాబు ఆశయాలను నెరవేర్చేందుకే పవన్ జనసేన పార్టీ పెట్టారని మండిపడ్డారు.
జీవో నంబర్ 1 గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. దాచేపల్లి పర్యటనలో జనసేన కార్యకర్తలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు నన్ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తల తీరును పవన్ ఎలా సమర్ధిస్తారో చెప్పాలి అని కోరారు.
చదవండి: (పేర్లు మాత్రమే వేరు.. మనుషులు ఇద్దరూ ఒక్కటే: విడదల రజిని)
Comments
Please login to add a commentAdd a comment