Hemant Kumar
-
ప్రాణం తీసిన ఈత సరదా
తాడేపల్లిరూరల్/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడారు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్ కుమార్ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపాడారు. మరో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారిని వెతుకుతుండగా ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్ దివ్యాంగుడు, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలలకు గుంటూరు కొత్తపేటకు చెందిన రేషి కళ్యాణ్ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్ కొట్టుకుపోయాడు. -
పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి..
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో కత్వా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి అమానుషంగా చంపారు. ఫింటర్ చౌక్ వద్ద శనివారం రాత్రి విధులు నిర్వహించిన హేమంత్ కుమార్‌తో నిందితులు గొడవ పడ్డారు. ఇద్దరూ రాళ్లు తీసుకుని దాడి చేయడంతో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంమడుగులో పడివున్న హేమంత్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. నిందితులను నరేశ్ భద్వాల్, మన్వీర్ లలోత్రాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
మెట్రో నగరాల్లో టాల్గో రైళ్లు!
న్యూఢిల్లీ: స్పెయిన్‌లో తయారయ్యే టాల్గో రైళ్లను మనదేశంలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. టాల్గో రైలు ఆదివారం చివరిపరీక్షను ఎదుర్కొని ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవడం తెలిసిందే. ఈ రైలు భారత్‌లో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తిచేసుకోవడంతో మెట్రో నగరాల మధ్య వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అనుకుంటోంది. అయితే టాల్గో బోగీలను యథాతథంగా భారత్‌లో ప్రవేశపెట్టలేమనీ, మన దేశ అవసరాలు, ప్లాట్‌ఫాంల ఆకృతికి తగ్గట్టు స్వల్ప మార్పులు చేయాలని రైల్వే వర్గాలు తెలిపాయి. టాల్గో రైలు బోగీలు అల్యూమినియంతో తయారై, తక్కువ బరువు, ఎక్కువ వేగం కలిగి ఉంటాయి. ‘తేలికగా ఉండే అల్యూమినియం రైలు బోగీలను మన రైల్వేలో ప్రవేశపెట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను మేం పరిశీలిస్తున్నాం’ అని రైల్వే బోర్డు సభ్యుడు హేమంత్ కుమార్ చెప్పారు. ఇప్పుడున్న పట్టాలపైనే రైళ్లను మరింత వేగంగా ఎలా నడపగలమో ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుత టాల్గో రైలుకు బోగీలు మాత్రమే స్పెయిన్ నుంచి వచ్చాయి. ఇంజిన్ భారతీయ రైల్వేదే వాడుతున్నారు. ఇప్పటికి గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపారు. బోగీల రవాణా ఖర్చును కూడా స్పెయినే భరించి బోగీలను ఇక్కడకు పంపింది. -
‘మాగ్లెవ్ రైలు’పై అధ్యయనం
న్యూఢిల్లీ: దేశంలో అధిక వేగవంతమైన మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైళ్లను నడిపే అవకాశాలను రైల్వే పరిశీలించనుంది. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో గంటకు 500 కి.మీ. వేగంతో నడిచే ఈ రైళ్లను ప్రవేశపెట్టటం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను కోరగా.. అమెరికా నుంచి రెండు సంస్థలు, జపాన్ నుంచి ఒక సంస్థ ఆసక్తి కనబరచాయి. ఈ రైళ్లు అయస్కాంత శక్తితో నడుస్తాయి. రైలును ముందుకు లాగేలా పట్టాలు అయస్కాంత శక్తి నిర్వహిస్తుంటాయి. అయస్కాంతాలను కంప్యూటర్లతో నియంత్రిస్తారు. ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ సమర్పించడానికి సెప్టెంబర్ 6 చివరి తేదీ అని రైల్వే సభ్యుడు(రోలింగ్ స్టాక్) హేమంత్ కుమార్ తెలిపారు. ప్రయాణికులతో పాటు వస్తువులు చేరవేయడానికి కూడా మాగ్లెవ్ రైళ్లు వినిగియోగించుకోవచ్చని చెప్పారు. -
సమగ్రపోషణ ముఖ్యం..
ఖమ్మం వ్యవసాయం: వరిలో అధిక, సుస్థిర దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ ఎం. వెంకట్రాములు అంటున్నారు. భూసార పరీక్ష చేయించి నేల సారాన్ని బట్టి సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర సూక్ష్మ పోషకాలు అందించాలని అన్నారు. రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకుని సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట ఎరువుల వాడి పైరుకు సమతుల్యంగా అందించాలని అంటున్నారు. రసాయనిక ఎరువులు మాత్రమే వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు, అధికమవడమే కాక ఖర్చు పెరిగి రాబడి కూడా తగ్గుతుందని, వీటితో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, వాతావరణం, భూమి, మనుషులకు అనర్థాలు కలుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా రైతులకు వారు పలు సూచనలు చేశారు.. సమగ్ర పోషక యాజమాన్యం: వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైరును పెంచి కలిపి దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల సుమారు 20 నుంచి 25 శాతం వరకు నత్రజని, భాస్వరం, పొటాష్లను ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన అజోల్లా, అజోస్పైరిల్లమ్, ఫా స్పోబాక్టీరియా తదితర జీవన ఎరువులను వా డడం వల్ల నత్రజని, భాస్వరం మోతాతులను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించవచ్చు. అజోల్లా : వరిసాగుకు ముందు దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ను వేసి పలుచగా నీరు నిల్వ చేయాలి. అందులో 100 - 150 కిలోల అజోల్లా వేసి రెండు నుంచి మూడు వారాలు పెరుగనిచ్చి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజని నేలకు చేరుతుంది. అజటోబాక్టర్ : ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. లేదా ఎకరాకు 300 మి.లీ నుంచి 500 మి.లీ ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. ఫాస్పోబ్యాక్టీరియా: ఫాస్పోబ్యాక్టీరియా ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. (ఈ జీవన ఎరువులు వ్యవసాయ పరిశోధనా సంస్థ అమరావతి (ఫోన్ నంబర్ 08654-288245)లో లభ్యమవుతాయి). భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్ నిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు ప్రకారం ఒక ఎకరాకు 40 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి. నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోనూ, దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశలోనూ, బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36 - 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చలక(తేలిక) భూముల్లో ఆఖరి దమ్ముల్లో సగం, అం కురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని అంకురం ఏర్పడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది. ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో పాటు జింక్ సల్ఫేట్‌ను కలి పి వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్య వధి ఉండాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురు గు లేదా తెగుళ్ల మందులను కలుపకూడదు. ఇనుము లోప లక్షణాలు కనిపించినప్పుడు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు, కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కల్గిన ద్రావణాన్ని (0.5 నుంచి 1 శాతం) వాడాలి. -
మొక్కజొన్న రైతులూ జాగ్రత్త
ఖమ్మం వ్యవసాయం: మొక్కజొన్న పంటను జిల్లాలో 8,230 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కె.6, జె.ఎల్.24, ట్యాగ్-24 తదితర రకాలను వేశారు. జూన్, జులై నెలల్లో విత్తిన మొక్కజొన్నను కాండం తొలిచే పురుగు ఆశించింది. జింక్, భాస్వరం లోపాలు కూడా ఉన్నట్లు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణపై కోఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ ‘సాక్షి’కి వివరించారు. కాండం తొలిచే పరుగు... కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 10-20 రోజులకు పైరును ఆశిస్తుంది. పిల్లపురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తింటాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది వెడల్పు రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుసక్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని ఆశించటం వల్ల దిగుబడి తగ్గుతుంది. నివారణ చర్యలు... పొలంలో కలుపు మొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ 3-4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర్‌పంటలుగా అపరాలు (కంది, సోయాబీన్, బొబ్బర్లు) సాగు చేయడం వల్ల సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. మోనోక్రొటోఫాస్ 36 యస్.ఎల్ మందును ఎకరాకు 320 మి.లీ 200 లీటర్ల నీటికి కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. జింక్ లోపం.. జింక్ లోపం వల్ల ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారుతాయి. లేదా లేత పైరు తెల్లమొగ్గగా మారుతుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్‌ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ను మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో వేయాలి. పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంతగా తేమ ఉండాలి. మొదటి దఫా ఎరువులు వేసిన తర్వాత సాళ్లలోని మట్టిని మొక్కల మొదళ్లలోకి ఎగదోయాలి. -
పత్తిపంట ‘పిండి’పిండి
ఖమ్మం వ్యవసాయం: ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుతున్న పత్తి పంటలో పిండినల్లి తెగులు వ్యాప్తిచెందుతోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ తెగులు వ్యాప్తి అధికంగా ఉందని డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. చెను చుట్టూ ఉండే పిచ్చి మొక్కల నుంచి పిండినల్లి పురుగులు పత్తిలోకి చేరుతుండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెగులు లక్షణాలు పెద్ద, చిన్న పురుగులు పత్తి చెట్టు కాడలు, ఆకులు, గూడ, కాయలు, కాండం నుంచి రసం పీలుస్తాయి. ఫలితంగా ఈ భాగాలు వాడి రాలిపోతాయి. చెట్టు పెరుగుదల నిలిచిపోతుంది. కాయలు సరిగా విచ్చుకోవు. విచ్చుకున్న కాయల్లోనూ గింజ నాణ్యత తగ్గుతుంది. పిండినల్లి పురుగు విసర్జించే తేనెవంటి పదార్థం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది. ఈ పురుగు ఆశించిన ప్రదేశాల్లో గండు చీమలు తేనె కోసం తిరగడం గమనించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉంటే పత్తి మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఇది అన్ని దశల్లోనూ సంభవించవచ్చు. పిండినల్లి నివారణ-పంట యాజమాన్య పద్ధతులు గతంలో వేసిన పంట తాలూకు అవశేషాలు పొలం నుంచి తొలగించి కాల్చివేయాలి. అలా చేయని పక్షంలో పిండినల్లి పురుగు ఈ అవశేషాల్లోనే ఉండి వేయబోయే పంటకూ వ్యాపిస్తుంది. పొలం దున్నే సమయంలో చీమల పుట్టలు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయాలి. పొలం గట్లపై పిండినల్లి తెగులు ఆశించిన కలుపు ఉంటే పీకి నాశనం చేయాలి. గట్లపై సాధమైనంతవరకు కలుపులేకుండా చూసుకోవాలి. పిండి పురుగు ఆశించిన కొమ్మలు, మొక్కలు తొలగించి నాశనం చేయడం ద్వారా చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. {పారంభంలో ఈ తెగులు కొన్ని మొక్కలకే వ్యాపిస్తుంది. అప్పుడు ఈ పురుగు సముదాయాన్ని గుర్తించి గోనె పట్టాతో రుద్ది నాశనం చేయాలి. జీవ సంబంధ పద్ధతులు పిండినల్లి పురుగు జీవితచక్రంలో చాలా దశలు ఉన్నాయి. ఈ పురుగును ఆశించే సహజ శత్రువులు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బదనికలు. సహజసిద్ధంగా పిండినల్లి పురుగును ఆశించే ట్రిప్టోలిమస్ మాంట్రోజరి, సిర్ఫిడ్ ఈగలను రైతులు విధిగా రక్షించుకోవాలి. పిండినల్లి నివారణకు పురుగుమందులు వాడేటప్పుడు మేలు చేసే ఈగలకు హాని జరగకుండా తక్కువ డోసు ఉండే రసాయనిక మందునే ఉపయోగించాలి. శిలీంద్రాలు: బవేరియా బాసియానా, వర్టిసిల్లియం లకాని ఫార్మలేషన్స్ వాడి పురుగు ఉధృతిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు. రసాయనిక పద్ధతులు మొదటిదశ పురుగులపై తెల్లని మైనం వంటి పదార్థం ఉండదు. ఈ దశలో కీటక నాశనులను పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ పిండి నల్లి పురుగు మొదట్లో కొన్ని మొక్కలనే ఆశిస్తుంది. ఆశించిన చెట్లు, చుట్టుపక్కల పిచికారీ చేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల పురుగు పక్క మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. పురుగు ఉధృతి పెరిగినప్పుడు ప్రొఫెనోపాస్ మూడు మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి రెండు,మూడు పర్యాయాలూ స్ప్రే చేయాలి. పై మందులతో పాటు సర్ఫ్పౌడర్ 0.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు. -
నగరానికి కొత్త టెర్మినస్
ముంబై, సాక్షి : కోటికిపైగా జనాభాతో కిక్కిరిసిపోయిన ముంబై నగరంలో ఎన్ని రైల్వే టెర్మినస్‌లు ఉన్నప్పటికీ సరిపోవడం లేదు. దీంతో రైల్వే అధికారులు నిరంతరం ఈ సమస్య పరిష్కారానికి, సేవల విస్తరణకు యత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే పశ్చిమ రైల్వే మరో టెర్మినస్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం బాంద్రా, ముంబై సెంట్రల్ టెర్మినస్లున్నాయి. ఇప్పటికే ఈ రెండు టెర్మినస్లూ కిక్కిరిసిఉన్నాయి. ఏటికేటా ప్రయాణికులు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నందున అయితే వచ్చే పదేళ్లలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటికి తోడు మరో టెర్మినస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనిపై పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ కొత్త టెర్మినస్ ఏర్పాటుకు భారీ ఎత్తున స్థలం సేకరించాలని, అయితే ఇది ముంబై ఉత్తర ప్రాంతంలోనే సమకూర్చుకోవచ్చని అన్నారు. అయితే ఖచ్చితంగా కొత్తటెర్మినస్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారన్నది ఆయన చెప్పలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కొత్త టెర్మినస్ ఏర్పడితే మరిన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, అటు బోరివిలి, అంధేరి, ఇటు డహను ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉంటుందని వారు భావిస్తున్నారు. వృద్ధులకూ ప్రత్యేక బోగీలు : హైకోర్టు ఆదేశం ముంబై లోకల్ రైళ్లలో మహిళలకు కేటాయించినట్లుగానే వృద్ధులకూ ప్రత్యేక బోగీలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని పశ్చిమ, సెంట్రల్ రైల్వే అధికారులను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఓకా, జస్టిస్ ఏఎస్ చందుర్కార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు రైల్వే బోర్డుకి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. వాస్తవానికి ముంబైలోని లోకల్ రైళ్లు కిక్కిరిసి ప్రయాణిస్తుంటాయి. ప్రవేశ ద్వారం వద్ద నిలబడే ఎక్కువ మంది వెళుతుంటారు. దీనికితోడు ఏ స్టేషన్లోనూ ఇవి పట్టుమని నిమిషం కూడా ఆగవు. దీంతో ఆ క్షణంలో దిగని పక్షంలో మరో స్టేషన్‌కి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఆ కొన్ని సెకన్లలోనే నెట్టుకుంటూ, తోసుకుంటూ లోపలికి వెళ్లడం యువకులకే కష్ట సాధ్యం. అలాంటి పరిస్థితులున్నందునే ఈ రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిలో మహిళలు కాసింత ప్రశాంతంగా వెళ్లేందుకు అవకాశం కలుగుతోంది. ఇదే తరహాలో సీనియర్ సిటిజన్లకూ ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ ఓ వ్యక్తి వేసిన వ్యాజ్యం మేరకు కోర్టు ఈ సూచనలు చేసింది. వాస్తవానికి సీనియర్ సిటిజన్ల కోసం సగం బోగీని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి అధికారులు రైల్వే బోర్డుకు 1998, 2005లలో ప్రతిపాదనలు పంపినా అది వాటిని తిరస్కరించింది. అయితే ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు మళ్లీ ఈ ప్రతిపాదనలు పంపుతున్నందున వాటిని ఉన్నతాధికారులు అమలు చేస్తారని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు.