‘మాగ్లెవ్ రైలు’పై అధ్యయనం | Railways explore running Maglev trains at 500 kmph speed | Sakshi
Sakshi News home page

‘మాగ్లెవ్ రైలు’పై అధ్యయనం

Published Wed, Aug 10 2016 10:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

‘మాగ్లెవ్ రైలు’పై అధ్యయనం

‘మాగ్లెవ్ రైలు’పై అధ్యయనం

న్యూఢిల్లీ: దేశంలో అధిక వేగవంతమైన మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైళ్లను నడిపే అవకాశాలను రైల్వే పరిశీలించనుంది. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో గంటకు 500 కి.మీ. వేగంతో నడిచే ఈ  రైళ్లను ప్రవేశపెట్టటం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను కోరగా.. అమెరికా నుంచి రెండు సంస్థలు, జపాన్ నుంచి ఒక సంస్థ ఆసక్తి కనబరచాయి. ఈ రైళ్లు అయస్కాంత శక్తితో  నడుస్తాయి. రైలును ముందుకు లాగేలా పట్టాలు అయస్కాంత శక్తి నిర్వహిస్తుంటాయి. అయస్కాంతాలను కంప్యూటర్లతో నియంత్రిస్తారు. 

ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ సమర్పించడానికి సెప్టెంబర్ 6 చివరి తేదీ అని రైల్వే సభ్యుడు(రోలింగ్ స్టాక్) హేమంత్ కుమార్ తెలిపారు. ప్రయాణికులతో పాటు వస్తువులు చేరవేయడానికి కూడా మాగ్లెవ్ రైళ్లు వినిగియోగించుకోవచ్చని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement