magnetic levitation
-
గంటకు 600 కి.మీ వేగం..!
బీజింగ్, చైనా : మాగ్నటిక్ లెవిటేషన్ సాంకేతికతతో గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలును చైనా తయారు చేయనుంది. ఈ మేరకు టెక్నికల్ ప్లాన్‌ను శనివారం ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థ సీఆర్ఆర్సీ క్వింగ్డా సిఫాంగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును భుజానికెత్తుకుంది. మాగ్నటిక్ లెవిటేషన్ టెక్నికల్ ప్లాన్‌ను 19 మంది అకడమీషియన్స్, నిపుణులు పరిశీలించారు. పలు అనుమానాల నివృత్తి అనంతరం ప్లాన్‌ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టు కొరకు 18 దేశాలతో పరిశోధించేందుకు 2016లో చైనా శాస్త్ర సాంకేతిక శాఖ అనుమతి ఇచ్చింది. చైనా 25 వేల కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలు ట్రాక్‌ను నిర్మించింది. ఈ మార్గాల్లో సరాసరి గంటకు 350 కిలోమీటర్ల వేగాలతో బుల్లెట్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. -
‘మాగ్లెవ్ రైలు’పై అధ్యయనం
న్యూఢిల్లీ: దేశంలో అధిక వేగవంతమైన మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైళ్లను నడిపే అవకాశాలను రైల్వే పరిశీలించనుంది. నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో గంటకు 500 కి.మీ. వేగంతో నడిచే ఈ రైళ్లను ప్రవేశపెట్టటం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)ను కోరగా.. అమెరికా నుంచి రెండు సంస్థలు, జపాన్ నుంచి ఒక సంస్థ ఆసక్తి కనబరచాయి. ఈ రైళ్లు అయస్కాంత శక్తితో నడుస్తాయి. రైలును ముందుకు లాగేలా పట్టాలు అయస్కాంత శక్తి నిర్వహిస్తుంటాయి. అయస్కాంతాలను కంప్యూటర్లతో నియంత్రిస్తారు. ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ సమర్పించడానికి సెప్టెంబర్ 6 చివరి తేదీ అని రైల్వే సభ్యుడు(రోలింగ్ స్టాక్) హేమంత్ కుమార్ తెలిపారు. ప్రయాణికులతో పాటు వస్తువులు చేరవేయడానికి కూడా మాగ్లెవ్ రైళ్లు వినిగియోగించుకోవచ్చని చెప్పారు.