గంటకు 600 కి.మీ వేగం..! | China To Build Maglev Train | Sakshi
Sakshi News home page

గంటకు 600 కి.మీ వేగం..!

Published Sat, Jan 27 2018 4:19 PM | Last Updated on Sat, Jan 27 2018 4:19 PM

China To Build Maglev Train - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌, చైనా : మాగ్నటిక్‌ లెవిటేషన్‌ సాంకేతికతతో గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్‌ రైలును చైనా తయారు చేయనుంది. ఈ మేరకు టెక్నికల్‌ ప్లాన్‌ను శనివారం ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థ సీఆర్‌ఆర్‌సీ క్వింగ్‌డా సిఫాంగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును భుజానికెత్తుకుంది.

మాగ్నటిక్‌ లెవిటేషన్‌ టెక్నికల్‌ ప్లాన్‌ను 19 మంది అకడమీషియన్స్‌, నిపుణులు పరిశీలించారు. పలు అనుమానాల నివృత్తి అనంతరం ప్లాన్‌ను ఆమోదించారు.
ఈ ప్రాజెక్టు కొరకు 18 దేశాలతో పరిశోధించేందుకు 2016లో చైనా శాస్త్ర సాంకేతిక శాఖ అనుమతి ఇచ్చింది. చైనా 25 వేల కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ రైలు ట్రాక్‌ను నిర్మించింది. ఈ మార్గాల్లో సరాసరి గంటకు 350 కిలోమీటర్ల వేగాలతో బుల్లెట్ ట్రైన్స్‌ పరుగులు తీస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement