అమ్మో..! ఆ కాళరాత్రులు...
విజయవాడవాసులకు భరోసానిచ్చి న వైఎస్ జగన్ దార్శనికత
రక్షణ గోడ నిర్మాణంతో వరద కష్టాలకు ముగింపు
రూ.474.51 కోట్లతో 5.66 కిలోమీటర్ల పటిష్ట రక్షణ కవచం
బెజవాడకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అపూర్వ కానుక
లోతట్టు ప్రాంతాలవాసుల బతుకులకు భరోసా
కృష్ణమ్మ పోటెత్తుతున్నా థిలాసా
ఇంత ధీమాగా ఉంటామని కలలో కూడా అనుకోలేదంటున్న కృష్ణలంక వాసులు
అంతకు ముందటి వరద కష్టాలు తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు
కృష్ణవేణి... తెలుగింటి విరిబోణీ.. అంటూ సినీ కవుల పాటలు వినసొంపుగా ఉంటాయి. కృష్ణా నదికి వరద వస్తే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ మీదకు వెళ్లి ఆ సోయగాన్ని చూడటం సామాన్యులకు ఓ మధురానుభూతి. కానీ విజయవాడ కృష్ణలంక తోతట్టు ప్రాంతాల వారు కృష్ణమ్మకు వరద వస్తుందంటేనే హడలెత్తిపోయేవారు. నదిని ఆనుకుని ఉన్న కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్, గౌతమి నగర్, బాలాజీ నగర్, భ్రమరాంబపురం, భూపేష్‌గుప్తా నగర్, తారకరామా నగర్, గీతానగర్, చలసాని నగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ, రణదివె నగర్ తదితర కాలనీలు దశాబ్దాల పాటు వరద బాధిత ప్రాంతాలుగానే మిగిలిపోయాయి.
ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలితే చాలు.. ఆ కాలనీలను వరద ముంచెత్తేది. ఇళ్లన్నీ నీట మునిగిపోయేవి. ఆ వెంటనే కొన్ని వస్తువులు, దుస్తులు తీసుకొని పిల్లలు, వృదు్థలతో సహా కృష్ణలంక గట్టు మీదకు చేరేవారు. అక్కడే టార్పాలిన్లు వేసుకుని వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసేవారు. ఓ సారి వరద వస్తే వారం వరకూ కొనసాగేది. వర్షం, చలి మధ్య వీధి దీపాలు కూడా లేని ఆ గట్టు మీద చీకట్లోనే రోజులు వెళ్లదీయాల్సి వచ్చేది.
దాదాపు 5 వేల కుటుంబాలు దశాబ్దాలపాటు అనుభవించిన దుస్థితి ఇది. వారందరూ రెక్కాడితేగానీ డొక్కాడని ముఠా కార్మికులు, రోజు కూలీలు, చిరు వ్యాపారులే. అటు పనులకు వెళ్లలేక ఇటు ఇళ్లలోకి వెళ్లలేక అవస్థలు పడేవారు. అయినా గతంలో ఏ ప్రభుత్వమూ వీరి కడగండ్లను పట్టించుకోలేదు. తమ బతుకులు ఇంతే అంటూ ఆ పేదలు కూడా నిస్పృహలో కూరుకుపోయారు.
వరద వచ్చి నా ఇప్పుడు బెంగ లేదు
20 ఏళ్లుగా కృష్ణలంక భూపేష్ నగర్‌లోనే ఉంటున్నాం. గతంలో చాలాసార్లు కృష్ణా నదికి వరదలు వచ్చాయి. చిన్న వరద వస్తే కుటుంబమంతా కట్టుబట్టలతో కృష్ణలంక గట్టు మీదకు వెళ్లిపోయేవాళ్లం. వంట సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అయిదారురోజుల తరువాత వరద తగ్గితే ఇంటికి చేరేవాళ్లం. పాడై పోయిన ఇంటిని బాగుచేసుకొనేవాళ్లం. అన్ని సామాన్లు మళ్లీ కొనుక్కోవాల్సిందే.
ఇంటి రిపేర్లు, అత్యవసరమైన సామాన్లకే అయిదారు నెలల సంపాదన ఖర్చయ్యేది. ఇక మా పరిస్థితి ఇంతే అనుకునే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతం చేసింది. కృష్ణా నదికి రక్షణ గోడ నిరి్మంచింది. మా ప్రాంతాలకు వరద ముప్పు పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వస్తున్నా నేను ఇంట్లోనే ధీమాగా ఉన్నాను. – వై. బాబూరావు, తాపీ మేస్త్రి
జగన్ చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకుంటాం
కృష్ణలంక ప్రజలు ఈ రోజు ఇంత ధైర్యంగా ఉన్నారంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే కారణం. కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మించాలని గతంలో ఎన్నో ప్రభుత్వాలను వేడుకున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. వరదలు వచ్చి నప్పుడు మంత్రులు, అధికారులు వచ్చి పరామర్శించి వెళ్లిపోయేవారు. కానీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేం కోరకుండానే కృష్ణా నదికి రక్షణ గోడ కట్టారు. అదీ అత్యంత పటిష్టంగా నిరి్మంచారు. మా కాలనీలకు ముంపు భయం పూర్తిగా తొలగిపోయింది. ఎంత వరద వచ్చి నా మాకు ఎలాంటి భయం లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచిని ఈ ప్రాంతంలోని 3 లక్షల మంది జనాభా జీవితాంతం గుర్తుంచుకుంటా. – చిన్నపరెడ్డి వెంకటరెడ్డి, తారకరామ నగర్, విజయవాడ
జగన్ దయతో ప్రశాంతంగా ఉన్నాం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రక్షణ గోడ కట్టబట్టే కృష్ణా నదికి ఇంత పెద్ద వరద వచ్చి నా మేం ప్రశాంతంగా ఉన్నాం. వరదలు వస్తే మా ఇళ్లన్నీ మునిగిపోయి రోడ్డున పడేవాళ్లం. రోడ్డు మీద మా బతుకులను ఎవరూ పట్టించుకునే వారే కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రక్షణ గోడ కట్టడంతోపాటు మా కాలనీలకు రోడ్లు కూడా వేసింది. – బి. రమణమ్మ, రాణిగారితోట, విజయవాడ
వరదకు అడ్డుగా జగన్... అడ్డుకట్టగా రిటైనింగ్ వాల్
మనసున్న పాలకుడు వస్తే పేదల కష్టాలకు శాశ్వత పరిష్కారం ఎలా చూపిస్తారో అనడానికి వైఎస్ జగనే ఏకైక ఉదాహరణ. కృష్ణలంక లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను అడ్డుకట్ట వేసిన ఏకైక ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు నదిని ఆనుకుని 5.66 కిలోమీటర్ల మేర పటిష్టమైన రక్షణ గోడ నిర్మించారు.
మూడు దశల్లో మొత్తం రూ.474.51 కోట్లతో నిర్మించిన ఈ రక్షణ గోడ నేటి కృష్ణా నది భారీ వరద నుంచి లోతట్టు ప్రాంతాలను కాపాడే రక్షణ కవచంగా నిలిచింది. వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఈ రక్షణ గోడ డిజైన్‌ను ఖరారు చేశారు. గత వందేళ్లలో కృష్ణా వరదలను పరిగణలోకి తీసుకుని.. 2009లో కృష్ణా నదికి వచ్చి న గరిష్ట వరద లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు.
12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేకుండా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మించారు. వైఎస్ జగన్ దూరదృష్టే ప్రస్తుతం కృష్ణా నదికి 11లక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద మప్పు లేకుండా ధీమాగా ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment