యాదాద్రి పవర్ ప్లాంటుకుఅనుబంధంగా నిర్మాణం
కృష్ణాలో తుంగపాడు వాగు కలిసేచోట కొత్త పట్టణం
రూ.928.52 కోట్ల అంచనాలతో టెండర్ ప్రకటన
3,52,771.02 చ.మీ.లవిస్తీర్ణంలో టౌన్‌షిప్ ఏర్పాటు
ప్రాజెక్టు పూర్తికి 30 నెలల గడువు
వచ్చే నెల 7వ తేదీన ప్రైస్‌బిడ్లు తెరిచి టెండర్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో రూ.928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 3న, ప్రైస్ బిడ్లను 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు.
సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం
కృష్ణా నదిలో తుంగపాడు వాగు కలిసే చోట ఈ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించారు. డిజై న్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్íÙప్ నిర్మాణం జరుగుతుంది. 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివా స గృహసముదాయాలతో లేఅవుట్‌ను తయా రు చేశారు. 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కు లు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.
2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మి కులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్‌షిప్‌ను జెన్‌కో నిర్మిస్తోంది. ఉన్నతాధికారుల కోసం ‘ఏ’–టైప్‌లో రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లను, ‘బీ’–టైప్‌లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు.
అధికారులకు ‘డీ’, ‘ఈ’టైప్ క్వా ర్టర్లను, కార్మి కులకు ‘ఎఫ్’టైప్ క్వార్టర్లను కేటాయిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు కలిపి మొత్తం 2,970 ఫ్లాట్లను నిర్మించనున్నారు.
సకల సదుపాయాలు
టౌన్‌షిప్‌లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆస్పత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెనెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్స్, సెప్టిక్ ట్యాంక్స్, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జీ, కాంపౌండ్ వాల్, టౌన్‌షిప్‌కు అప్రోచ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా జెన్‌కో నిర్మిస్తోంది.
టౌన్‌షిప్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రోజుకు 1,000 కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను సైతం నిర్మిస్తోంది. కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్‌లో జెన్‌కో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment