ఫైల్ ఫోటో
విజయవాడ: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఈరోజు(బుధవారం) జరగాల్సిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం రద్దైంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు దుర్గగుడి అధికారులు వెల్లడించారు. ఆగమశాస్త్రం ప్రకారం వర్షం పడుతున్నప్పుడు శివాలయం నుంచి ఉత్సవ మూర్తులను బయటకు తీయకూడదని శాస్త్రం చెబుతున్న కారణంగానే తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.
వర్ష ప్రభావం చేత తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నాం
వర్షం కారణంగా తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నాం. వర్షం పడుతుంటే శాస్త్రం ప్రకారం ఉత్సవమూర్తులను బయటకు తీయకూడదు. విగ్రహాలు తడిస్తే స్నపనాభిషేకాలు చేయాలి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లనే తెప్పోత్సవాన్ని నిర్వహించలేకపోతున్నాం. 21 ఏళ్లలో తెప్పోత్సవం రద్దు చేయడం ఇది రెండోసారి.
- శివప్రసాద్ శర్మ, దుర్గగుడి స్థానాచార్యులు
Comments
Please login to add a commentAdd a comment