sri durga malleswara swamy temple
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.అయితే ఎక్స్ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నారు. -
ముగిసిన భవానీ దీక్షల విరమణలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్ద ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు సోమవారంతో ముగిశాయి. మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కలశ ఉద్వాసన, వేద ఆశీర్వచనంతో దీక్షలు పరిసమాప్తం అయ్యాయి. ఈ సందర్భంగా ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దీక్షల విరమణకు దాదాపు 4.5 లక్షల మంది భవానీలు విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు రూ.6 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఆర్జిత సేవలు యధాతథం జరుగుతాయని వివరించారు. -
నేడు ఉదయం 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): చంద్రగ్రహణం కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయాలతోపాటు ఉపాలయాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల వరకే దర్శనానికి అనుమతిస్తారు. ఎనిమిది గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 6.30గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి శుద్ది, అమ్మవారికి స్నపనాభిషేకం, అర్చన, మహానివేదన, హారతులను ఇచ్చి ఆలయ ద్వారాలను తిరిగి మూసివేస్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలను మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన నుంచి సాయంత్రం పంచహారతులు వరకు అన్ని సేవలను రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అన్ని ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం (ఫొటోలు)
-
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం రద్దు
విజయవాడ: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఈరోజు(బుధవారం) జరగాల్సిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం రద్దైంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు దుర్గగుడి అధికారులు వెల్లడించారు. ఆగమశాస్త్రం ప్రకారం వర్షం పడుతున్నప్పుడు శివాలయం నుంచి ఉత్సవ మూర్తులను బయటకు తీయకూడదని శాస్త్రం చెబుతున్న కారణంగానే తెప్పోత్సవాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. వర్ష ప్రభావం చేత తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నాం వర్షం కారణంగా తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నాం. వర్షం పడుతుంటే శాస్త్రం ప్రకారం ఉత్సవమూర్తులను బయటకు తీయకూడదు. విగ్రహాలు తడిస్తే స్నపనాభిషేకాలు చేయాలి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లనే తెప్పోత్సవాన్ని నిర్వహించలేకపోతున్నాం. 21 ఏళ్లలో తెప్పోత్సవం రద్దు చేయడం ఇది రెండోసారి. - శివప్రసాద్ శర్మ, దుర్గగుడి స్థానాచార్యులు -
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు (ఫొటోలు)
-
అమెరికాలో దుర్గమ్మకు కుంకుమార్చనలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు అమెరికాలోని పలు నగరాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోసం ఏటా దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో ఆర్జిత సేవలు జరిగేవి. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఈ సేవలను నిలిపివేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నుంచి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానం నుంచి అమెరికాకు ఉత్సవమూర్తులను తీసుకెళ్లారు. అమ్మవారికి అలంకరించేందుకు ఆభరణాలను అమెరికాకు పంపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం శాన్హోస్లోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఆది దంపతులకు ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీ హోమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఆలయంలో పూజలు జరుగనున్నాయి. 29 నుంచి లాస్ఏంజెల్స్లో.. ఈ నెల 29 నుంచి 31 వరకు లాస్ఏంజెల్స్లోని శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో, జూన్ 2 నుంచి 4 వరకు న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం, శ్రీ శివవిష్ణు ఆలయాల్లో, జూన్ 5 నుంచి 7 వరకు బాల్టిమోర్‌లోని శ్రీ షిర్డీసాయి మందిర్‌తో పాటు మరికొన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. జూన్ 11న ఆలయ అర్చకులు దేవతా విగ్రహాలతో తిరిగి భారత్‌కు చేరుకుంటారు. -
వైభవంగా దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వస్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివాలయం నుంచి దుర్గాఘాట్‌కు దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు చేరుకుని.. హంస వాహనంపై కొలువు దీరారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు.(చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెప్పోత్సవాన్ని తిలకించారు. వరద నేపథ్యంలో నదిలో విహారం లేకుండా తెప్పోత్సవం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇచ్చారు. -
దుర్గమ్మ దర్శనంతో ఎంతో ధైర్యం : నటి హేమ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మను దర్శించుకుంటే మనసుకు ఎంతో ధైర్యంగా ఉంటుందని నటి హేమ పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను శనివారం హేమ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు సమర్పించారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. దసరా ఉత్సవాల్లో తొలిరోజు దుర్గమ్మను దర్శించుకుంటానని, ఆ ధైర్యంతోనే తాను సినిమా రంగంలో రాణిస్తున్నానన్నారు. మోహన్ బాబు సతీమణి కూడా నిర్మలాదేవి దుర్గమ్మను దర్శించుకున్నారు.