సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వస్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివాలయం నుంచి దుర్గాఘాట్‌కు దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు చేరుకుని.. హంస వాహనంపై కొలువు దీరారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు.(చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?)
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెప్పోత్సవాన్ని తిలకించారు. వరద నేపథ్యంలో నదిలో విహారం లేకుండా తెప్పోత్సవం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment