
విజయపురిసౌత్: ఎగువున గల కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో బుధవారం సాగర్ జలాశయం 18 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఐదు అడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరగడంతో నాలుగు రేడియల్ క్రస్ట్‌గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు 1,12,300 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,708 క్యూసెక్కులు మొత్తం 2,22,503 క్యూసెక్కులను దిగువున గల కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 1,94,758 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590.00 అడుగులు గరిష్ట స్థాయి నీటిమట్టంతో ఉంది. 18 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 1,29,600 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,070 క్యూసెక్కులు మొత్తం 1,58,670 క్యూసెక్కులు దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలు, ఎస్‌ఎల్‌బీసీ, వరద కాలువ ద్వారా 20,313 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment