
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వికారబాద్: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చిగురాల్‌పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంపల్లి నర్సింలు(43) గ్రామ శివారులోని చెరువులో నిత్యం చేపలు పడుతుండేవాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు గ్రామానికి చెందిన పసుల నరేష్‌తో చేపల వేటకు వెళ్లాడు.
నీటిలోకి వెళ్లిన నర్సింలు ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో నరేష్ గ్రామంలోకి వచ్చి విషయం స్థానికులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాలించారు. ఎంతవెతికినా మృతదేహం లభించకపోవడంతో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి చెరువులో దిగి గాలించి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment