
సాక్షి,పరిగి(వికారబాద్): అప్పటి వరకు బుడిబుడి నడకలతో ఇల్లంతా సందడి చేసిన చిన్నారి.. ఆడుకుంటూ వెళ్లి రెండో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రాపోల్‌కు చెందిన సందీప్ పరిగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పరిగిలోని అయ్యప్ప కాలనీలో ఓ ఇంట్లో కుటుంబంతో సహా అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం సందీప్ కుమార్తె పర్ణిక (18 నెలలు) రెండో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో చికిత్స నిమిత్తం నగరానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న..
Comments
Please login to add a commentAdd a comment