దైవదర్శనం కోసం వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు అనుమానాస్సద రీతిలో ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడి మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండటం కొత్తగట్టులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
దక్షిణ భారతంలోనే మొట్టమొదటి వైష్ణవ క్షేత్రంగా పేరొందిన శ్రీమత్స్యగిరీంద్రస్వామి దర్శనం కోసం కొత్తగట్టుకు వచ్చిన ఈ నలుగురి మరణవార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిని కరీంగర్లోని కోతిరాంపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి కిరణ్ (22), గెర్రె శ్రీధర్ (22), కిషన్పూర్కు చెందిన గుగ్గిళ్ల వాహిని (21), లింగంపల్లి స్వప్న (21)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కోనేరు గట్టుపై పడిఉన్న నాలుగు సెల్ ఫోన్లు, ఐడీ కార్డుల ఆధారంగా మృతుల ఆచూకీని పోలీసులు గుర్తించారు.
అయితే వీరు కోనేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారా? అన్నది తెలియరాలేదు. చనిపోయిన నలుగురూ.. రెండు బైకులపై వచ్చినట్లు స్థానికులు చెప్పారు. అంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం శవాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ యువతీ యువకులది ఆత్మహత్యేనా!
Published Wed, Apr 8 2015 5:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement