Four youth
-
చెరువులో పడి నలుగురు యవకులు మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా, మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విందు కోసం వచ్చిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మునిగిపోవడంతో మృతిచెందారు. మృతులు కొండాపురం, కోనాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ యువతీ యువకులది ఆత్మహత్యేనా!
దైవదర్శనం కోసం వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు అనుమానాస్సద రీతిలో ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడి మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండటం కొత్తగట్టులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి వైష్ణవ క్షేత్రంగా పేరొందిన శ్రీమత్స్యగిరీంద్రస్వామి దర్శనం కోసం కొత్తగట్టుకు వచ్చిన ఈ నలుగురి మరణవార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిని కరీంగర్‌లోని కోతిరాంపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి కిరణ్ (22), గెర్రె శ్రీధర్ (22), కిషన్పూర్కు చెందిన గుగ్గిళ్ల వాహిని (21), లింగంపల్లి స్వప్న (21)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కోనేరు గట్టుపై పడిఉన్న నాలుగు సెల్ ఫోన్లు, ఐడీ కార్డుల ఆధారంగా మృతుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. అయితే వీరు కోనేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారా? అన్నది తెలియరాలేదు. చనిపోయిన నలుగురూ.. రెండు బైకులపై వచ్చినట్లు స్థానికులు చెప్పారు. అంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం శవాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
డబ్బు అడగబోయినందుకు.. మహిళపై గ్యాంగ్‌రేప్
డబ్బు అడగబోయినందకు 30ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని ద్వారకాలో ఓ గెస్ట్ హౌస్‌లో గతరాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయమై గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన ఆమెను నలుగురు బలవంతంగా గ్యాంగ్‌రేప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారైయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వికాస్, అనిల్, రమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
బాలికపై నలుగురు యువకుల అత్యాచారం
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. 15 సంవత్సరాల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా, తమ దృష్టికి వచ్చినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన బాలికను నలుగురు యువకులు బుధవారం సాయంత్రం బలవంతంగా ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ఆమెను తీవ్రంగా బెదిరించారు. దాంతో ముందు భయంతో నోరు విప్పని ఆ బాలిక.. తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో వాళ్లు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే.. పోలీసులు మాత్రం ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. -
14ఏళ్ల బాలికపై మూడురోజులుగా గ్యాంగ్ రేప్
పశ్చిమబెంగాల్ దారుణాన్ని ఇంకా మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాంటిదే మరో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ 14ఏళ్ల విద్యార్థినిపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా మూడు రోజుల పాటు పలుమార్లు వారు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మావానా ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బుధవారంనాడు మార్కెట్‌కు వెళ్లిన విద్యార్థినిని ఐదుగురు యువకులు బలవంతంగా ఇంచులై ప్రాంతంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఓ రబ్బర్ ట్యూబ్‌తో కట్టిపడేసి, మత్తుమందు ఇచ్చి ఒకరి తరువాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం మొదలుపెట్టిన ఈ కీచకపర్వాన్ని శుక్రవారం వరకు కొనసాగించారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో బాలికను వారు శుక్రవారం నాడు ఆమె ఇంటి సమీపంలో వదిలివెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు అంజాద్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు ముందు తనను నిందితుడు అంజాద్ అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్టు చెప్పింది. కాగా, వైద్య పరీక్షలో కూడా ఆమె అత్యాచారానికి గురైనట్టు నిర్థారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
యువతిపై మరో దారుణం
రాష్ట్ర రాజధానిలో కీచకపర్వం లైంగికదాడికి యత్నించిన నలుగురు యువకులు ప్రతిఘటించినందుకు కిరోసిన్ పోసి హత్యాయత్నం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో దారుణం.. పట్టపగలు ఓ యువతిపై సామూహిక లైంగికదాడి యత్నం.. ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించిన అమానుషత్వం. దేశవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న అకృత్యాలకు మరో నిలువెత్తు నిదర్శనం బుధవారం హైదరాబాద్ నడిబొడ్డున వెలుగుచూసింది. వివరాలు: హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సలాం, సాజిదా బేగంలు భార్యాభర్తలు. భర్త నుంచి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న సాజిదా.. కుమార్తె అర్షియా ఫాతిమా అలియాస్ సమ్రీన్ (22), కుమారుడు అజీజ్‌తో కలసి అదేప్రాంతంలో నివసిస్తోంది. బుధవారం మధ్యాహ్నం వారాసిగూడ కౌసర్ మసీదు ప్రాంతానికి చెందిన ఇసాక్ నుంచి ఫోన్ రావడంతో సమ్రీన్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ సమీపంలో మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేస్తూ పరిగెత్తుకుంటూ రోడ్డు పైకి వచ్చి పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు రగ్గుల సాయంతో మంటల్ని ఆర్పి, పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. బాధితురాలిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. గట్టిగా కేకలు వినిపించడంతో బయటకు వచ్చామని, అప్పటికే మంటలు అంటుకున్న ఆమె రోడ్డుపై పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు రమేష్, విజయ్‌కుమార్ తెలిపారు. తాము మంటల్ని ఆర్పిన తరవాత ఓ బెడ్‌షీట్ అందించగా లేచి నిలబడి దాన్ని కట్టుకుందని తెలిపారు. పోలీసులు గాంధీ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఇసాక్ నాకు ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు. ఇసాక్‌తో పాటు షకీల్, ఇస్మాయిల్, షాకత్లు కూడా ఉన్నారు. ఆ నలుగురు నన్ను బలవంతంగా పాడు బడిన రైల్వేక్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నాపై లైంగికదాడికి ప్రయత్నించారు. నేను ప్రతిఘటించడంతో వారు నాపై కిరోసిన్‌ను పోసి నిప్పంటించారు’. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలితో పాటు గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇసాక్, సమ్రీన్లకు పాత పరిచయం ఉన్నట్లు తెలియడం, బాధితురాలికి మంగళవారమే పెళ్లి చూపులు జరగడంతో.. దానికి, ఈ ఉదంతానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే జయసుధ బాధితురాలిని పరామర్శించారు. -
బాలికపై నలుగురి కీచకుల ఆకృత్యం
ఖమ్మం: కీచకుల సంతతి రోజురోజుకీ పెరిగిపోతోంది. కీచకుల ఆకృత్యాలకు బాలికలు బలైపోతున్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దీంతో ఆడపిల్లలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కామాంధుల కబంధహస్తాల్లో చిన్నారులు నలిగిపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పెనుబల్లి మండలం బవర్నపాలెంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ నలుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.