బాలికపై నలుగురి కీచకుల ఆకృత్యం | Girl gang raped in Khammam district | Sakshi
Sakshi News home page

బాలికపై నలుగురి కీచకుల ఆకృత్యం

Published Mon, Dec 30 2013 6:21 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

Girl gang raped in Khammam district

ఖమ్మం: కీచకుల సంతతి రోజురోజుకీ పెరిగిపోతోంది. కీచకుల ఆకృత్యాలకు బాలికలు బలైపోతున్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దీంతో ఆడపిల్లలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కామాంధుల కబంధహస్తాల్లో చిన్నారులు నలిగిపోతున్నారు.

ఖమ్మం జిల్లాలోని ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పెనుబల్లి మండలం బవర్నపాలెంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ నలుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement