యువతిపై సామూహిక అత్యాచారం
రాజస్థాన్లో ఘోరం జరిగింది. 24 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆగస్టు 14వ తేదీనే జరిగినా.. ఆలస్యంగా ఇప్పటికి బయటపడింది. ఆ యువతికి తెలిసిన సుశీల్ అనే యువకుడు ఆమెను జాదోన్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్యామ్ కచోలియా అనే వ్యక్తికి అతడి ఫ్లాట్లో పరిచయం చేసినప్పుడే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు మత్తుమందు కలిపిన డ్రింకును ఆమెకు ఇచ్చారు. ఆ విషయం తెలియని ఆమె దాన్ని తాగేసింది. ఆమె స్పృహ కోల్పోగానే ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత వాళ్ల స్నేహితుడు ఫతే సింగ్ కూడా అక్కడికొచ్చి, అతడూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఎట్టకేలకు బాధితురాలు బజాజ్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.