జైపూర్(రాజస్థాన్): దాండియా ఆడేందుకు వెళ్లిన ఓ బాలిక గ్యాంగ్‌రేప్, దారుణ హత్యకు గురయింది. రాజస్థాన్ లోని కోటాలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒరియా కాలనీకి చెందిన ఓ బాలిక(16) దాండియా ఆడేందుకు వెళ్లింది. అదే ప్రాంతంలో ఉండే ఇద్దరు బాలురు(17) బాలికకు మాయమాటలు చెప్పి దాండియా ఆడే చోటుకు పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె తలపై బండరాయితో కొట్టి చంపేశారు.
గురువారం ఉదయం స్థానికులు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని కోటా ఎస్పీ అన్షుమన్ భోమియా తెలిపారు.
దాండియాకు వెళితే దారుణం
Published Fri, Sep 29 2017 3:07 PM | Last Updated on Fri, Sep 29 2017 3:07 PM
Advertisement
Advertisement