బాలికపై నలుగురు యువకుల అత్యాచారం | girl gang raped by four youth in anantapur | Sakshi
Sakshi News home page

బాలికపై నలుగురు యువకుల అత్యాచారం

Published Fri, Jul 11 2014 10:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

బాలికపై నలుగురు యువకుల అత్యాచారం - Sakshi

బాలికపై నలుగురు యువకుల అత్యాచారం

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. 15 సంవత్సరాల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా, తమ దృష్టికి వచ్చినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన బాలికను నలుగురు యువకులు బుధవారం సాయంత్రం బలవంతంగా ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా సామూహిక అత్యాచారం చేశారు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ఆమెను తీవ్రంగా బెదిరించారు. దాంతో ముందు భయంతో నోరు విప్పని ఆ బాలిక.. తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో వాళ్లు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే.. పోలీసులు మాత్రం ఇంతవరకు కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement