karimnager
-
15నుంచి ఆమరణ దీక్ష
హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలి హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి శాసనమండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం హుస్నాబాద్ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోతే ఈ నెల 15 నుంచి అమరణ దీక్ష చేపడుతామని హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలో మహ్మదాపూర్ గ్రామస్తులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో హుస్నాబాద్‌ను సిద్దిపేటలో జిల్లాలో కలపాలని మళ్లీ తీర్మానాలు చేసి పంపించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సింగిల్ విండో డైరెక్టర్ అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, అఖిల పక్ష నాయకులు ఆకుల వెంకట్, కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పిట్టల నారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, వేముల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్,జాగిరి సత్యనారాయణ, శివరాజ్, గవ్వ వంశీధర్‌రెడ్డి, వలస సుభాష్, రాజు,శ్రీధర్ తదితరులున్నారు. -
బంద్ ప్రశాంతం
-
జిల్లాలో నయీం భూదందా !
నగునూరులో సెటిల్మెంట్ రూ.4కోట్ల విలువైన రెండు ఎకరాలు కొనుగోలు మాజీ సర్పంచ్ భర్త కీలకపాత్ర నయీమ్ ఇంట్లో దొరికిన పత్రాలతో లోతుగా విచారిస్తున్న పోలీసులు నయీమ్ ఇంట్లో తనిఖీల్లో వెల్లడైన పత్రాలకు సంబంధించిన భూమి ఇదే సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నÄæూమ్, అతడి అనుచరుల భూదందా బాగోతం వెలుగుచూస్తోంది. నయీమ్ ఇంట్లో పోలీసులు చేసిన తనిఖీల్లో కరీంనగర్ మండలం నగునూరు గ్రామానికి చెందిన భూముల వివరాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ భర్త నయీమ్ పేరుతో బెదిరింపులకు గురిచేసి పెద్ద ఎత్తున భూములను సెటిల్మెంట్ చేస్తూ అతడితో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఇలా ఉన్నాయి. 2002లో రమేశ్‌రావు అనే రియల్టర్ నగునూరు గ్రామంలో గూడూరి సదాశివరావుకు చెందిన 23 ఎకరాలను కొనుగోలు చేసి 327 ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతున్న క్రమంలోనే 2009లో సాంబశివరావు 23 ఎకరాలను సురేందర్ పేరిట జీపీఏ చేయించాడు. అదే ఏడాది జనవరిలో జిల్లా కోర్టులో ఉన్న కేసును హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయించాడు. జీపీఏ భూములను విక్రయిస్తున్నామని, అభ్యంతరాలుంటే తెలపాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సందర్భంలోనే కరీంనగర్ మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ భర్త నయీమ్ అనుచరుడిగా రంగ ప్రవేశం చేశారని పోలీసులు భావిస్తున్నారు. తనతోపాటు మరో నలుగురితో కలిసి జీపీఏ ఆధారంగా ముందుగా ఎకరం విస్తీర్ణంలో ఉన్న దాదాపు 60 ప్లాట్లను కొనుగోలు చేయడంతోపాటు ప్లాట్లను చదును చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్లాట్లను గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు వచ్చి అడిగితే నÄæూమ్ పేరుతో బెదిరింపులకు గురిచేశారని, దాదాపు నెలరోజులపాటు ప్లాట్ల వద్దనే ఉంటూ దౌర్జన్యానికి దిగినట్లు తెలిసింది. నయీమ్ పేరుతో పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. అప్పట్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి సమ్మక్క జాతర పేరిట పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. కోర్టులో కేసు ఉందని, ఈ భూమిని నయీమ్ కొన్నాడంటూ మాజీ సర్పంచ్ భర్త చెబుతూ గతంలో ప్లాట్లు కొన్న ధరకంటే తక్కువ మొత్తంలో డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేసినట్లు తెలిసింది. ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లలో అత్యధికులు సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులేనని తేలింది. ఉద్యోగులు తమకు వాళ్లతో గొడవ ఎందుకనే కారణంతో విలువైన ప్లాట్లను తక్కువ ధరకే అమ్మేసి వెళ్లిపోయినట్లు సమాచారం. నయీమ్ ఇంట్లో దొరికిన పత్రాల్లో నగునూరులోని సర్వే నెంబర్ 383 నుంచి 412 వరకు దాదాపు రెండెకరాల మేరకు తన అనుచరుల పేరిట ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటి విలువ మార్కెట్లో రూ. 4కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంకా నయీమ్ అనుచరులెవరున్నారు, ఎక్కడెక్కడ భూ దందాలు, సెటిల్మెంట్లు చేశారనే విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. -
కరీంనగర్లో పేట్రేగిన దొంగలు
‘ఖని’ ఆస్పత్రిలో బయోమెట్రిక్ స్కానర్ చోరీ గోప్యంగా ఉంచిన సర్కారు వైద్యులు నిలిచిన ఆపరేషన్లు మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ వారం రోజులుగా ఇన్‌పేషెంట్ల ఇబ్బందులు కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ విభాగంలోని బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ స్కానర్(వేలి ముద్రల సేకరణ యంత్రం) చోరీ అయిన విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది, ఇన్‌పేషెంట్ల వేలిముద్రలు నమోదు చేసే ఈ స్కానర్ వారం క్రితం చోరీకి గురికాగా, ఆస్పత్రి సిబ్బంది, అధికారులు విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. ఫలితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇన్‌పేషెంట్లకు చేయాల్సిన ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఐదుగురు ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీని వివరణ కోరగా యంత్రం చోరీ అయిన విషయం నిజమేనన్నారు. విచారణ కోసం ట్రస్ట్‌తోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయించమని తెలిపారు. పేషెంట్లు ఇబ్బంది పడకుండా మరో యంత్రం కొనుగోలు కోసం ట్రస్ట్‌కు లేఖ రాయడంతోపాటు రూ.3,150 చెక్కును పంపినట్లు వెల్లడించారు. మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ మహాముత్తారం : మండల ప్రాథమిక సహకార పరపతి సంఘం బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. లోనికి చొరబడిన దొంగలు చైర్మన్ గది తలుపులు పగులగొట్టి క్యాషీయర్ రూంలోకి వెళ్లారు. లాకర్‌ను గడ్డ పార ఉపయోగించి పగులగొట్టడానికి విఫలయత్నం చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న కౌంటర్, బీరువాను ధ్వంసం చేసి అందులోని రూ.13 వేలు ఎత్తుకెళ్లారు. సోమవారం 10 గంటలకు బ్యాంక్‌కు వచ్చిన అటెండర్ బ్యాంకు తలుపులు ధ్వంసమై ఉండడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ సిబ్బంది, కాటారం సీఐ సదన్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్రావు, క్లూస్‌టీం సంఘటన స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బ్యాంక్‌సిబ్బంది చేతివేలి ముద్రలు సంఘటన జరిగిన పరిసరాలను, లాకర్, బీరువాపై ఉన్న వేలి ముద్రలు సేకరించారు. మంథని సబ్ డీఎల్పీవో జయప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల సిరిసిల్ల టౌన్ : బంధువులు ఇంట్లో శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిన సంఘటన సిరిసిల్ల పట్టణంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయం వీధికి చెందిన మరిపల్లి విఠల్ రిటైర్డు బ్యాంకు ఉద్యోగి. కరీంనగర్‌లోని అతడి బంధువుల ఇంట్లో పూజ ఉండడంతో శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి అందరూ వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం తాళం తీసి ఉంది. చుట్టుపక్కల వారు దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే విఠల్‌కు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చారు. దేవుని గదిలోని బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు నెక్లెస్, మూడు వందల గ్రాముల వెండి సింహాసనం, రూ.7,500 దేవునికి ముడుపుల నగదు చోరీ అయినట్లు గుర్తించాడు. రూ.1.20 లక్షల విలువైన వస్తువులు చోరీ అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. అగ్రహారంలో చైన్‌స్నాచింగ్ వేములవాడ రూరల్ : వేములవాడ మండలం అగ్రహారం వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. సిరిసిల్లకు చెందిన పద్మ, రాజు దంపతులు ద్విచక్రవాహనంపై వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. అగ్రహారం వద్దకు రాగానే మరో ద్విచక్రవాహనంపై వెనుకనుంచి వచ్చిన ఇద్దరు యువకులు పద్మ మెడలోని పుస్తెలతాడు లాక్కుని పారిపోయారు. బాధితులు వెంబడించినా దొరకలేదు. ఈ మేరకు బాధితులు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
హరితహారం
-
సామాన్యుడి బజార్
-
కలక్టరేట్ వద్ద వీఆర్వోల ఆందోళన
కరీంనగర్ : ఎంతోకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీర్వోలు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద భైటాయించారు. కనీసవేతనాలు అమలు చేయాలన డిమాండ్ చేశారు. నాల్గోతరగతి ఉద్యోగులు తమను గుర్తించాలని నినదించారు. 010 పద్దు కింది జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైన తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
యువరైతు ఆత్మహత్య
అకాల వర్షంతో పంటను దెబ్బతీయడంతో మనస్తాపానికి లోనైన ఓ యువరైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఆరె రవి అనే యువరైతు తనకున్న రెండెకరాల వరిపంట సాగు చేస్తున్నాడు. రెండు రోజులుగు కురుస్తున్న ఆకాల వర్షాలతో వరిపంట పూర్తిగా నెలకొరిగింది. గత ఏడాది గల్ఫ్ కు వలస వెళ్లడంకోసం చేసిన లక్ష రూపాయలతోపాటు పంట ఖర్చులకు కొత్త అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆ యువతీ యువకులది ఆత్మహత్యేనా!
దైవదర్శనం కోసం వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు అనుమానాస్సద రీతిలో ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడి మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండటం కొత్తగట్టులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి వైష్ణవ క్షేత్రంగా పేరొందిన శ్రీమత్స్యగిరీంద్రస్వామి దర్శనం కోసం కొత్తగట్టుకు వచ్చిన ఈ నలుగురి మరణవార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిని కరీంగర్‌లోని కోతిరాంపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి కిరణ్ (22), గెర్రె శ్రీధర్ (22), కిషన్పూర్కు చెందిన గుగ్గిళ్ల వాహిని (21), లింగంపల్లి స్వప్న (21)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కోనేరు గట్టుపై పడిఉన్న నాలుగు సెల్ ఫోన్లు, ఐడీ కార్డుల ఆధారంగా మృతుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. అయితే వీరు కోనేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారా? అన్నది తెలియరాలేదు. చనిపోయిన నలుగురూ.. రెండు బైకులపై వచ్చినట్లు స్థానికులు చెప్పారు. అంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం శవాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.