- హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలి
- హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి
- శాసనమండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
15నుంచి ఆమరణ దీక్ష
Published Sat, Sep 3 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
హుస్నాబాద్ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోతే ఈ నెల 15 నుంచి అమరణ దీక్ష చేపడుతామని హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలో మహ్మదాపూర్ గ్రామస్తులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ఇందుకు భిన్నంగా టీఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో హుస్నాబాద్‌ను సిద్దిపేటలో జిల్లాలో కలపాలని మళ్లీ తీర్మానాలు చేసి పంపించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సింగిల్ విండో డైరెక్టర్ అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, అఖిల పక్ష నాయకులు ఆకుల వెంకట్, కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పిట్టల నారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, వేముల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్,జాగిరి సత్యనారాయణ, శివరాజ్, గవ్వ వంశీధర్‌రెడ్డి, వలస సుభాష్, రాజు,శ్రీధర్ తదితరులున్నారు.
Advertisement
Advertisement