diksaha
-
ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ దీక్షలు
అనంతపురం టౌన్: ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ దీక్షలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై జూలై 2న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేక నిరసన దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసంపై నాలుగేళ్లల్లో ఏనాడూ విమర్శలు చేయని టీడీపీ నేతలు..ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. టీడీపీ ఎన్నిడ్రామాలు ఆడినా... ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మారిన ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 29సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన చంద్రబాబు... గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే ఆవహేళనగా మాట్లాడిన చంద్రబాబుకు... దీక్షలు చేసే నైతికహక్కు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపై పోరాటం సాగించాలన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, జిల్లా అధికార ప్రతినిధి చింత కుంట మధు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు మారుతి ప్రకాష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. -
15నుంచి ఆమరణ దీక్ష
హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలి హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి శాసనమండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం హుస్నాబాద్ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోతే ఈ నెల 15 నుంచి అమరణ దీక్ష చేపడుతామని హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలో మహ్మదాపూర్ గ్రామస్తులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో హుస్నాబాద్‌ను సిద్దిపేటలో జిల్లాలో కలపాలని మళ్లీ తీర్మానాలు చేసి పంపించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సింగిల్ విండో డైరెక్టర్ అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, అఖిల పక్ష నాయకులు ఆకుల వెంకట్, కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పిట్టల నారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, వేముల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్,జాగిరి సత్యనారాయణ, శివరాజ్, గవ్వ వంశీధర్‌రెడ్డి, వలస సుభాష్, రాజు,శ్రీధర్ తదితరులున్నారు.