ఎంతోకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీర్వోలు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద భైటాయించారు.
కరీంనగర్ : ఎంతోకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీర్వోలు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద భైటాయించారు. కనీసవేతనాలు అమలు చేయాలన డిమాండ్ చేశారు. నాల్గోతరగతి ఉద్యోగులు తమను గుర్తించాలని నినదించారు.
010 పద్దు కింది జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైన తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.