యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు | TWO DROWNED IN YANAMADURRU DRAIN | Sakshi
Sakshi News home page

యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు

Published Sun, Jan 1 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు

యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు

భీమవరం టౌన్‌ : భీమవరం పట్టణంలోని యనమదుర్రు  డ్రెయిన్‌లోకి దూకి యువతి, యువకుడు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఓ యువతి బైపాస్‌ రోడ్డులో వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకింది. ఆ సమయంలో అక్కడే ఉన్న యువకుడు ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకాడు. వీరు దూకిన ప్రాంతంలోఊబిలా ఉండటంతో కూరుకుపోయి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూబోట్‌లో గా లింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన యువతి సుంకర పద్దయ్య వీధికి చెందిన పి.సత్యస్వరూప (18)గా అక్కడ ల భించిన ఒక ప్రైవేట్‌ విద్యా సంస్థ ఐడెంటిటీ కార్డు ద్వారా తెలిసింది. యువకుడు చిన్నఅప్పారావు తోట ప్రాంతానికి చెందిన కనిమిరెడ్డి మహేష్‌ (25)గా తెలుస్తోంది. యనమదుర్రు డ్రెయిన్‌లో దూకడానికి కొద్ది సమయం ముందు లంకపేట వద్ద వీరిద్దరూ ఘర్షణ పడ్డారని, తర్వాత ఆమె వేగంగా నడుచుకుంటూ వచ్చి వంతెనపై నుంచి దూకిందని తెలుస్తోంది. వెనుకనే మోటార్‌ సైకిల్‌పై  వచ్చిన మహేష్‌ ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకగా ఇద్దరు గల్లంతయ్యా రు. వీరిద్దరూ ప్రేమికులని గతంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో విడిపోయారని ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టు మరికొందరు చెబుతున్నారు. దీనిపై టూటౌ¯ŒS పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులను వివరణ కోరగా తమకెలాంటి ఫి ర్యాదు అందలేదని చెప్పారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement